: మిస్ ఇండియానే కాదు... ఇక నుంచి మిస్టర్ ఇండియా కూడా!
యువతుల కోసం అందాల పోటీలు నిర్వహిస్తున్న మిస్ ఇండియా సంస్థ ఇక నుంచి యువకుల కోసం కూడా ఒక ఆకర్షణీయమైన పోటీ నిర్వహించబోతోంది. టైమ్స్ గ్రూపునకు చెందిన ఈ సంస్థ ‘మిస్టర్ ఇండియా - 2014’ పేరుతో త్వరలోనే కొత్త పోటీ ప్రారంభించనుంది. ఈ పోటీలో ఎంపికైన యువకుడు మిస్టర్ వరల్డ్ పోటీలో భారత్ కు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. 17-27 ఏళ్ల మధ్య అవివాహితులైన యువకులు ఈ పోటీలో పాల్గొనేందుకు అర్హులని సంస్థ పేర్కొంది. పూర్తి వివరాలను పురుషుల కోసం సంస్థ కొత్తగా ప్రారంభించిన వెబ్ పోర్టల్ లో పొందుపరిచారు.