: నోటు తీసుకుని ఓటు వేయవద్దు: హీరో శివాజీ
దొంగనోట్లతో ఓట్లు కొనాలని కొంత మంది నేతలు చూస్తున్నారని, ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని ఇటీవల బీజేపీలో చేరిన సినీ హీరో శివాజీ అన్నారు. ఎవరైనా ఓటుకు నోటు ఆఫర్ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన చెప్పారు. పార్టీలు ఓటర్లను ప్రభావం చేస్తున్నాయని, డబ్బులు తీసుకుని ఎవరూ ఓటు వేయవద్దని ఆయన ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం పనితీరును శివాజీ ప్రశంసించారు.
హైదరాబాదు, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో శివాజీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... తనకు రాయలసీమ నుంచి లెటర్ వచ్చిందని ఆయన తెలిపారు. ఆ ఉత్తరాన్ని ఆయన మీడియా ఎదుట చదివి వినిపించారు. ఓ నేత దగ్గర పనిచేసే వ్యక్తికి సోదరుడైన వ్యక్తి ఆ ఉత్తరం రాశాడని, సదరు నేత నివాసంలో దొంగ నోట్ల కట్టలు ఉన్నాయని ఆ ఉత్తరంలో ప్రస్తావించారని ఆయన చెప్పారు.