: తెలుగు జాతి కలిసి ఉండాలనే పార్టీ పెట్టా: కిరణ్
తెలుగు ప్రజలు శాశ్వతంగా కలిసి ఉండాలనే ఉద్దేశ్యంతోనే ‘జై సమైక్యాంధ్ర పార్టీ’ పెట్టినట్టు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కిరణ్ ఎన్నికల ప్రచారం జోరు పెంచారు. ఇవాళ చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలుగుజాతి కలిసుండాలని పోరాటం చేయడం కోసమే ప్రజల ముందుకు వచ్చానని, జేఎస్పీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. పాదరక్షలు గుర్తుకే ఓటు వేయాలని ఆయన అన్నారు. తమ పదవుల కోసం పార్టీ పెట్టలేదని, యువత భవిష్యత్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.