: మిస్ అమెరికా నీనా దావులూరితో హద్దు మీరి మాట్లాడిన విద్యార్థి


తెలుగు సంతతికి చెందిన అమెరికా అమ్మాయి, మిస్ అమెరికా నీనా దావులూరితో హద్దు మీరి మాట్లాడిన విద్యార్థిని ఆ స్కూలు యాజమాన్యం సస్పెండ్ చేసింది. పెన్సిల్వేనియాలోని ఒక స్కూల్ సందర్శనకు వెళ్లినప్పుడు 18 ఏళ్ల ఆ ఆకతాయి పాట్రిక్ ఫర్వెస్ తనతో డేటింగ్ చేయాల్సిందిగా నీనాను కోరాడు. ఆ స్కూలు వార్షికోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన ముఖాముఖి ప్రశ్నావళి కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆ విద్యార్థి ఒక ప్లాస్టిక్ గులాబీ పువ్వుతో వేదిక పైకి వచ్చి ఆ ప్రతిపాదన చేశాడు. ఇది విన్న వెంటనే 24 ఏళ్ల నీనా ఆశ్చర్యపోయి... తర్వాత దరహాసం చేస్తూ ఉండిపోయింది.

అయితే, ఈ ఆకతాయి చేష్టను ఆ పాఠశాల యాజమాన్యం సీరియస్ గా తీసుకుంది. ఆ విద్యార్థిని మూడు రోజుల పాటు సస్పెండ్ చేసింది. ఆ విద్యార్థి తమ మాటను లెక్క చేయకుండా ప్రవర్తించాడని యాజమాన్యం చెప్పింది. ఆ విద్యార్థి మాట్లాడుతూ... కొంత మంది ఒత్తిడి చేయడం వల్లే తానీ పని చేశానని చెప్పాడు. ఆ తర్వాత క్షమాపణ కోరుతూ అధికారులకు లేఖ రాశాడు.

  • Loading...

More Telugu News