: ఓటర్లు ప్రలోభాలకు గురికావద్దు, స్వచ్చంధంగా ఓటు వేయండి: డీజీపీ


ఎన్నికలు ప్రశాంతంగా జరగడం కోసమే పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని డీజీపీ ప్రసాదరావు పేర్కొన్నారు. విచ్చలవిడిగా నగదు పంపిణీ కాకుండా ఈసారి గట్టి నిఘా పెట్టామని ఆయన తెలిపారు. ఇప్పటివరకు కోట్ల రూపాయల డబ్బు పట్టుబడిందని ఆయన అన్నారు. ఆధారాలు ఉంటే పట్టుబడిన డబ్బును తిరిగి ఇచ్చేస్తున్నామని డీజీపీ తెలిపారు. ఓటర్లు ప్రలోభానికి గురికాకుండా స్వచ్చంధంగా ఓటు వేసే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టినట్టు ఆయన చెప్పారు.

ఇవాళ ఉదయం హైదరాబాదులోని నెక్లెస్ రోడ్ లో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో 5కె రన్ ను నిర్వహించారు. ‘డోన్ట్ ఓట్ ఫర్ నోట్’ పేరిట జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన డీజీపీ ప్రసాదరావు మాట్లాడుతూ... ఓటు హక్కును ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News