: ఎల్బీనగర్ లో టీడీపీకి ఎదురుదెబ్బ
గ్రేటర్ హైదరాబాదులోని ఎల్బీనగర్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీకి చెందిన పలువురు నేతలు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సమక్షంలో ఇవాళ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎల్బీనగర్ లో టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జి కృష్ణప్రసాద్, కార్పొరేటర్ ధనలక్ష్మి, లోకేంద్రనాథ్ తో పాటు పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.