: కారు ప్రమాదంలో గాయపడిన వెస్టిండీస్ క్రికెటర్!
వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ కేమర్ రోచ్ కారు ప్రమాదంలో గాయపడ్డారు. రోచ్ ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారు అదుపు తప్పడంతో బ్రిడ్జ్ టౌన్ నగర శివారులోని వన్స్టీడ్ డ్రైవ్ సమీపంలో శనివారం ప్రమాదానికి గురైంది.
ఓవల్ క్రికెట్ స్టేడియానికి సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో కారు పలు మార్లు పల్టీలు కొట్టిందని బార్బోడోస్ కు చెందిన వెబ్ సైట్ తెలిపింది. ఈ ప్రమాదంలో రోచ్ తలకు గాయమైందని, ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వెస్టిండీస్ జట్టు తరపున రోచ్ 23 టెస్టులు, 61 వన్డేలు ఆడిన సంగతి తెలిసిందే.