: దంపతుల హత్యకేసులో ఏడుగురి అరెస్ట్
అనంతపురం జిల్లాలో జరిగిన దంపతుల హత్యకేసుకు సంబంధించి పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఈ నెల ఒకటో తేదీన హిందూపురం మండలం తుంగేపల్లిలో బ్రాహ్మణ దంపతులను దారుణంగా హత్య చేసిన విషయం విదితమే. సుధాకర్ తూమకుంటలోని ఓ దేవాలయంలో అర్చకుడిగా పనిచేసేవారు. అతని భార్య శ్యామల (43) సంతేభిదనూరులో అంగన్ వాడి టీచరుగా పనిచేసేవారు.
సుధాకర్, శ్యామల దంపతులను ఒకటో తేదీ రాత్రి కొందరు వ్యక్తులు తుంగేపల్లిలోని గడ్డివాముల సమీపంలో కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి క్లూస్ టీమ్, జాగిలాలతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు.