: కామన్వెల్త్ క్రీడలకు ఎంపికైన గరిమా చౌదరి


ఉత్తరప్రదేశ్, మీరట్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల గరిమా చౌదరి జులై నెలలో లండన్ లో జరిగే కామన్వెల్త్ క్రీడలకు అర్హత సాధించింది. జూడోలో ఇప్పటికే అనేక పతాకాలు సాధించిన గరిమా చౌదరి 2012లో లండన్ లో జరిగిన ఒలింపిక్స్ గేమ్స్ కు కూడా 63 కిలోల విభాగంలో అర్హత సాధించింది. ఈ ఏడాది నేపాల్ లోని ఖాట్మండులో జరిగిన 7వ దక్షిణ ఆసియా ఛాంపియన్ షిప్ లో ఆమె స్వర్ణం సాధించింది. కామన్వెల్త్ క్రీడల్లోనూ అత్యుత్తమ ప్రదర్శనతో పతకాన్ని సాధిస్తానని గరిమా చౌదరి ధీమా వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News