: డిపాజిట్లు రావని ఆయనకు పార్టీ పెట్టినప్పుడే చెప్పా: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఓటమి భయంతో కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల నుంచి తప్పుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. డిపాజిట్లు రావని కిరణ్ పార్టీ పెట్టినప్పుడే చెప్పానని ఆయన గుర్తు చేశారు. సోనియాగాంధీకి తప్పుడు సమాచారమిచ్చి కిరణ్ ముఖ్యమంత్రి అయ్యారని ఆయన ఆరోపించారు.
జగన్ లేని లోటును తాను తీరుస్తానంటూ ఢిల్లీ పెద్దలకు కిరణ్ మాయమాటలు చెప్పారని పెద్దిరెడ్డి అన్నారు. ఆ తర్వాత ఆయన మూడేళ్లు సీఎంగా కొనసాగిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో పీలేరు నుంచి తప్పుకున్న కిరణ్... అక్కడ తన సోదరుడిని పోటికి నిలిపారని పెద్దిరెడ్డి చెప్పారు.