: లోపాలను సరిదిద్దుకున్నా: రాబిన్ ఊతప్ప
తన బ్యాటింగ్ లో లోపాలను సరిదిద్దుకున్నానని కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడు రాబిన్ ఊతప్ప తెలిపాడు. ప్రస్తుతం అసలైన ఆట ఆడుతున్నానని చెప్పాడు. నిన్న ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో రాబిన్ ఊతప్ప 41 బంతుల్లో 55 పరుగులు చేశాడు. అయినా, మ్యాచ్ లో విజయం డేర్ డెవిల్స్ నే వరించింది.