: ఎందుకు మాతో చేతులు కలిపారు?: వెంకయ్యనాయుడు
ఈ రోజు మోడీ శక్తిని అడ్డుకోవడం ఎవరి తరం కాదని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. మోడీ హవా చూసి కాంగ్రెస్ భయపడుతోందని ఎద్దేవా చేశారు. వెంకయ్యనాయుడు ఈ రోజు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ శకం ముగిసిందని, మోడీ శకం ఆరంభమైందన్నారు. బీజేపీ బలం రోజురోజుకీ పెరుగుతోందని చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు చరమగీతం పాడనున్నారని చెప్పారు. కాంగ్రెస్ హుందాగా ఓటమిని అంగీకరించి గౌరవనీయ ప్రతిపక్ష పాత్రను పోషించాలని సూచించారు.
మేము మద్దతివ్వకుంటే తెలంగాణ సాధ్యమయ్యేదే కాదని వెంకయ్యనాయడు చెప్పారు. 'జైరాం రమేశ్ ఎందుకు నా దగ్గరకు ఎనిమిది సార్లు వచ్చారు? ఎందుకు మీ ఆర్థిక మంత్రి మాతో మాట్లాడారు? అహ్మద్ పటేల్ ఎందుకు మాట్లాడారు? మాతో ఎందుకు చేతులు కలిపారు? మీ పార్టీ వాళ్లు తెలంగాణను వ్యతిరేకిస్తే, మీకు సంఖ్యా బలం లేకుంటే, మేము మద్దతిస్తే తెలంగాణ బిల్లు పాసయింది' అని బీజేపీపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేతలకు గుర్తుచేశారు.