: ప్రేమ పేరుతో వంచన
ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలో ఓ కామాంధుడు మైనర్ బాలికను ప్రేమ పేరుతో వంచించాడు. పట్టణంలోని ఓ కౌన్సిలర్ కుమారుడు జునైద్(25) ఇంటర్ చదువుతున్న 17 ఏళ్ల బాలికను ప్రేమిస్తున్నట్లుగా నమ్మించాడు. ఆమెతో శృంగారం నెరుపుతూ దాన్ని వీడియో తీశాడు. దానిని ఇంటర్నెట్ లో పెట్టడంతోపాటు స్నేహితులతో కూడా పంచుకున్నాడు. విషయం తెలియడంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.