: భర్త శవంతో మూడు రోజులు సహవాసం!
భర్త మరణించి మూడు రోజులైనా ఆ విషయాన్ని బయట ప్రపంచానికి తెలియనీయకుండా, ఆ శవంతోనే సహవాసం చేసిందో భార్యామణి! అనుమానాస్పదంగా మారిన ఈ సంఘటన కడపలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన పాండు రంగారావు ఆర్టీసీలో పని చేస్తున్నారు. అతనికి ఈ మధ్యనే కడప బదిలీ కావడంతో ఇల్లు అద్దెకు తీసుకుని కడపలో ఉంటున్నారు. పాండు రంగారావు మరణించి మూడు రోజులైంది. కాగా అతని భార్య తులసి గత మూడు రోజులుగా అతని శవంతోనే గడిపింది.
కళ్ళ నుంచి చుక్కనీరైనా రాల్చకుండా, ఇంట్లో భర్త విగతజీవిగా పడి ఉన్నా, ఏ విధమైన స్పందన లేకుండా, నిమ్మకు నీరెత్తనట్టు శవంతో ఎప్పట్లానే సహజీవనం చేసింది. ఇంట్లోంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి పరిశీలించగా, అత్యంత జుగుప్సాకరమైన రీతిలో శవం బయటపడింది. దీంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.