: కన్నడ సీమలో కొత్త కామబాబా
కన్నడ సీమకు.. కామంతో కన్ను మిన్ను గానక ప్రవర్తించే బాబా వేషగాళ్లకు ఏదో ప్రత్యేకమైన అనుబంధం ఉన్నట్లుంది. నిన్న మొన్నటి వరకు ప్రజలకు తన కామకేళీ విలాసాలతోనే ఎక్కువగా గుర్తుండిపోయిన స్వామి నిత్యానంద ప్రధాన ఆశ్రమం బెంగుళూరే. కాగా, కర్ణాటక ప్రాంతానికే చెందిన చిక్కబళ్లాపురంలో మరో కొత్త కామసాయిబాబా వ్యవహారం వెలుగుచూసింది.
చిక్కబళ్లాపురంలో శివసాయిబాబా అనే పేరుతో ఓ వ్యక్తి ఆశ్రమం నిర్వహిస్తున్నాడు. ఆయన తన ఆశ్రమంలో ఎలాంటి కామ కార్యకలాపాలకు పాల్పడుతున్నారో ఆదివారం నాడు ఒక టీవీ ఛానెల్ బయటపెట్టింది.
చిక్కబళ్లాపురంలో శివసాయిబాబా అనే పేరుతో ఓ వ్యక్తి ఆశ్రమం నిర్వహిస్తున్నాడు. ఆయన తన ఆశ్రమంలో ఎలాంటి కామ కార్యకలాపాలకు పాల్పడుతున్నారో ఆదివారం నాడు ఒక టీవీ ఛానెల్ బయటపెట్టింది.
స్థానిక చానెల్‌లో ప్రసారమైన ఈ ఎపిసోడ్ పర్యవసానంగా.. కర్ణాటక రక్షణ వేదిక సహా అనేక సంస్థల వారు ఆశ్రమంపై దాడికి ప్రయత్నించారు. నేను దేవుడినని చెప్పుకునే ఈ శివసాయిబాబా.. కేంద్రమంత్రి మునియప్ప, మాజీ మంత్రి జాలప్పలకు గురువు కావడం కొసమెరుపు