: వైఎస్సార్సీపీలోకి కందుల సోదరులు!
కడపకు చెందిన కందుల బ్రదర్స్ రాజమోహన్ రెడ్డి, శివానందరెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పనున్నట్టు తెలుస్తోంది. ఈ అన్నదమ్ములిద్దరూ వైఎస్సార్సీపీలోకి చేరే అవకాశం ఉందని సమాచారం. ఈ క్రమంలో వైసీపీ నేతలు వివేకానందరెడ్డి, అవినాష్ రెడ్డి కందుల నివాసంలో చర్చలు జరుపుతున్నారు. జగన్ సమక్షంలో వారిద్దరూ చేరనున్నట్టు వినికిడి. అయితే, టీడీపీ నేత సీఎం రమేష్ తీరుతోనే పార్టీని కందుల సోదరులు వీడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.