: లోక్ సభ బరి నుంచి రఘురామ కృష్ణంరాజు అవుట్


తీవ్ర ఉత్కంఠ నేపథ్యంలో నర్సాపురం లోక్ సభ బరి నుంచి పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణంరాజు తప్పుకున్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేశారు. కొన్ని సంస్థల వల్లే తనకు టికెట్ రాలేదని వెల్లడించారు. టికెట్ తెచ్చుకోవడంలో ఓడిపోయానన్నారు. అయితే, సీటు రాకపోవడం బాధించినా ప్రజల మద్దతు చూసి సంతోషపడుతున్నట్టు తెలిపారు. టీడీపీ, బీజేపీకి నష్టం కలిగించే చర్యలకు పాల్పడనన్నారు. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా టీడీపీ, బీజేపీ కూటిమితోనే ఉంటానని స్పష్టం చేశారు. ఎంపీ నిధుల కంటే సొంత నిధులతోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని రఘురామరాజు హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News