: కుక్క చెబితే ఓకే!
చోరీ మరియు హత్య జరిగాయి. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఒకరిని గుర్తింపు పెరేడ్ ద్వారా పట్టుకుంటే.. మరొకరిని పోలీసు కుక్క పసిగట్టింది. ఈ ఇద్దరికీ కింది కోర్టు జీవితఖైదు వేసింది. అయితే రమేష్ రాజా చవాన్ అనే నిందితుడిని పోలీసు కుక్క గుర్తించడం మినహా అతడు నేరస్తుడని చెప్పడానికి మరో ఆధారం లేదు.
ఈ పాయింటు పట్టుకుని సదరు నిందితుడు పైకోర్టుకు అప్పీలు చేసుకున్నాడు. 'కుక్కలు చాలా తెలివైనవని.. సైంటిఫిక్‌గా తేలిన సంగతే. వాటి ఆధారాలను నమ్మొచ్చు' అని పేర్కొంటూ కిందికోర్టు విధించిన శిక్షనే ఖరారు చేశారు. మరే ఇతర సాక్ష్యం లేనప్పుడు ఒక్క కుక్క ఒంటరిగా ఏం చేయగలుగుతుందిలే.. అని డాంబికాలు పోతే కుదర్దు. కుక్క చెప్పినా ఓకేనే అని ఈ కేసులో న్యాయస్థానం తీర్పు చెప్పేసింది మరి!