: టీడీపీ అభ్యర్థిని గెలిపించండి: సినీ హీరో వేణు
సినీ నటుడు వేణు తొట్టెంపూడి ఖమ్మం జిల్లాలో టీడీపీ అభ్యర్థి పేరిట ప్రచారం నిర్వహించారు. ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి సమర్థవంతమైన నాయకత్వం కావాలని, అందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే సరైన వ్యక్తి అని తెలిపారు. టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని స్థానికులను ఆయన కోరారు. హామీల కంటే సుపరిపాలన ముఖ్యమైనదని ఆయన అన్నారు.