: బెంచి టికెట్లు కొని సినిమాలు చూసిన చోటే నా సినిమాలు ఆడడం గర్వకారణం: వెంకట్


బెజవాడ గాంధీనగర్ లోని సినిమా థియేటర్లలో తాను బెంచి టికెట్ కొనుక్కుని సినిమాలు చూసేవాడినని సినీ నటుడు వెంకట్ తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, తాను పుట్టింది బెజవాడలోనేనని చెప్పారు. తనను హీరోను చేసింది కూడా బెజవాడేనని ఆయన వెల్లడించారు. తాను చదివింది ముంబైలో అయినా సెలవులన్నీ బెజవాడలోనే గడిచేవని తెలిపారు.

తాను క్యూలో నిల్చుని బెంచ్ టికెట్ కొని సినిమాలు చూసిన థియేటర్లలోనే సీతారాముల కల్యాణం, శివరామరాజు వంటి సినిమాలు అద్భుతంగా ఆడడం ఆనందంగా ఉందని అన్నారు. తాను ఈ మధ్యే నటించిన 'ఆ అయిదుగురు' సినిమా చాలా బాగుంటుందని, అందరూ చూసి ఆదరించాలని ఆయన కోరారు. అనంతరం సినిమా నటి అస్మిత సూద్ మాట్లాడుతూ, సినిమా చాలా బాగుంటుందని అన్నారు.

  • Loading...

More Telugu News