: మెక్సికోలో భూకంపం
మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.2 గా నమోదైంది. భూకంపం ధాటికి పలు ఇళ్లు ధ్వంసం కాగా, విద్యుత్, సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. కాళ్ల కింద భూమి ఒక్కసారిగా కుంగిపోతుండడం, ఇళ్లన్నీ చిగురుటాకుల్లా వణికిపోతుండడంతో ఇళ్లలోంచి స్థానికులు భయంతో పరుగులు తీశారు. జరిగిన ప్రాణ, ఆస్తి నష్టం వివరాలను అధికారికంగా ప్రకటించనప్పటికీ భారీ స్థాయిలో విధ్వంసం జరిగి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలు, భద్రతా దళాలు సహాయకచర్యలు చేపట్టాయి.