: సందడిగా 'సుకుమారుడు' ఆడియో ఫంక్షన్


యంగ్ హీరో ఆది, కథానాయికలు నిషా అగర్వాల్, భావన నటిస్తోన్న సినిమా `సుకుమారుడు`. 'పిల్ల జమిందార్' చిత్రాన్ని రూపొందించిన అశోక్ ఈ చిత్రానికీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. సూపర్ స్టార్ కృష్ణ, ఊర్వశి శారద కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం.  శ్రీ సౌదామిని క్రియేషన్స్ పతాకం మీద కెవీవీ సత్యనారాయణ సమర్పణలో, కె. వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
ఈ సినిమా ఆడియో కార్యక్రమం ఇవాళ తాజ్ దక్కన్ హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆది తండ్రి సాయికుమార్ ఇంకా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి అనుకరణ అందరినీ ఆకట్టుకుంది.

  • Loading...

More Telugu News