: పవార్ శివసేనతో చేయి కలపాలనుకున్నారట


కాంగ్రెస్ మిత్రపక్షమైన ఎన్సీపీ మహారాష్ట్రలో శివసేనతో జట్టుకట్టాలనుకున్న విషయం బయటకు వచ్చింది. శరద్ పవార్ సారధ్యంలోని ఎన్సీపీ తొలి నుంచీ యూపీఏతోనే కొనసాగుతోంది. మహారాష్ట్రలో దశాబ్దానికి పైగా కాంగ్రెస్, ఎన్సీపీ భాగస్వామ్యం నడుస్తోంది. అయితే, 2009 ఎన్నికల సమయంలో శరద్ పవార్ తమ పార్టీతో కూటమి కట్టడానికి అంగీకరించారని శివసేన సీనియర్ నేత మనోహర్ జోషి తెలిపారు. ఉద్దవ్ ఠాక్రే కోరడంతో తాను పవార్ తో మాట్లాడానని, ఆయన భాగస్వామ్యానికి అంగీకరించారని, ఆ తర్వాత ఏమైందోగానీ ఆయన వెనక్కి తగ్గారని జోషి వెల్లడించారు. దీనిపై ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ స్పందిస్తూ.. జోషికి సొంత పార్టీలో ప్రాధాన్యం లేకుండా పోయిందని, అందుకే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News