: ఆ ఆశ్లీల సన్నివేశాల్లో ఉన్నది నేను కాదు: హీరోయిన్ సంజన


నిన్న కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ కన్నడ హీరో జగ్గేష్ నటించిన 'అగ్రజ' అనే సినిమా విడుదలైంది. ఈ సినిమాలో ముద్దుగుమ్మ సంజన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా విడుదలైన రోజే వివాదాలకు తెరతీసింది.ఇందులో కొన్ని ఆశ్లీల సన్నివేశాలు ఉన్నాయని... ఆ సన్నివేశాల్లో ఉన్నది తాను కాదని... వేరొకరితో ఆ సన్నివేశాలను చిత్రీకరించి... అందులో ఉన్నది తానే అన్నట్టుగా చూపించారని సంజన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆశ్లీల సన్నివేశాల్లో తాను నటించినట్టు చూపించడం తనను ఎంతో బాధించిందని ట్విట్టర్లో తెలిపింది. దీనిపై ఆ సినిమా డైరెక్టర్ మాట్లాడుతూ, సినిమాలోని ప్రతి సన్నివేశం సంజనకు తెలుసని... తాము మోసానికి పాల్పడలేదని చెప్పాడు.

  • Loading...

More Telugu News