: పెళ్లి బస్సుపై తెగి పడిన విద్యుత్ తీగలు... ఐదుగురు మృతి
మధ్యప్రదేశ్ లో పెళ్లి సందడితో కళకళలాడాల్సిన ఓ ఇంట విషాదం నెలకొంది. బిండి జిల్లాలో 60 మంది పెళ్లి బృందంతో వెళుతున్న బస్సుపై హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగి పడడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరి కొందరికి గాయాలయ్యాయి. అదే రహదారిలో వెళుతున్న ఇతర వాహనదారులు పోలీసులకు సమాచారం చేరవేశారు. వారొచ్చి గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.