: ఎవరెస్ట్ పై హిమపాతం... 12కి చేరిన మృతుల సంఖ్య


ఎవరెస్ట్ శిఖరంపై ఇవాళ ఉదయం హిమపాతం కారణంగా జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 12కి చేరుకుందని అధికారులు వెల్లడించారు. ఎవరెస్ట్ పర్వతంపై పాప్ కార్న్ ఫీల్డ్స్ గా ప్రసిద్ధి చెందిన ప్రాంతంలో ఈ హిమపాతం చోటు చేసుకుంది. ఇప్పటివరకు 12 మృతదేహాలు లభ్యమయ్యాయని, మంచులో ఇంకా ఎంత మంది చిక్కుకుని ఉన్నారో తెలియడం లేదని నేపాల్ పర్యాటక శాఖ కార్యదర్శి దీపేంద్ర మీడియాకు చెప్పారు. హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం మీద ఇంత పెద్ద ప్రమాదం మునుపెన్నడూ జరగలేదు. పర్వతారోహకులకు మార్గాన్ని నిర్దేశించడానికి తాళ్లు కట్టేందుకు శిఖరంపైకి ఎక్కిన నేపాలీ షెర్పాలు ఈ ప్రమాదానికి గురయ్యారని సమాచారం.

  • Loading...

More Telugu News