: ఇసుక తుపానులో చిక్కుకున్న అనుష్క
బాలీవుడ్ తార అనుష్క శర్మ నటిస్తున్న ‘ఎన్.హెచ్ 10’ చిత్ర యూనిట్ ఇసుక తుపానులో చిక్కుకుంది. ఇసుక తుపాన్ కారణంగా రాజస్థాన్ లో జరుగుతున్న ‘ఎన్.హెచ్ 10’ చిత్ర షూటింగ్ కు అంతరాయం కలిగింది.
తనతో పాటు ‘ఎన్.హెచ్ 10’ సినిమా షూటింగ్ యూనిట్ అంతా ఇసుక తుపానులో నిన్న ఇరుక్కున్నామని, అయితే అందరం క్షేమంగా బయటపడ్డామని అనుష్క శర్మ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దుమ్ము, ధూళితో పాటు ఇసుక తమని చాలా ఇబ్బందికి గురి చేసిందని, ప్రతి ఒక్కరు సురక్షితంగా ఉన్నారని ఆమె ట్వీట్ చేసింది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ‘ఎన్.హెచ్ 10’ చిత్రానికి నవదీప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.