: వెంకయ్యనాయుడితో పీవీపీ భేటీ


బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడితో పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్ భేటీ అయ్యారు. విజయవాడ లోక్ సభకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని పీవీపీ చూస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం మూడు రోజుల నుంచి పవన్ తో ఆయన చర్చలు జరిపారు. ఎన్నికల్లో పోటీ చేయాలన్న దృఢసంకల్పంతో ఉన్న ఆయన వెంకయ్యనాయుడితో భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, సీమాంధ్రలో రేపటితో నామినేషన్ల పర్వం ముగియనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News