: రాష్ట్రపతికి ఆ సినిమా నచ్చింది!


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 'భూత్ నాథ్ రిటర్న్స్' సినిమా చూశారు. ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేస్తూ తీసిన ఈ చిత్రాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కోసం ప్రత్యేకంగా రాష్ట్రపతి భవన్ లోని ఆడిటోరియంలో ప్రదర్శించారు. బాలీవుడ్ లెజెండరీ స్టార్ అమితాబ్ బచ్చన్, బాల నటుడు పార్థ్, సినిమా దర్శకుడు, నిర్మాత ఈ ప్రదర్శనకు హాజరయ్యారు. వీరితో పాటు చిన్నారులు, వారి తల్లిదండ్రులతో ఆడిటోరియం నిండిపోయింది.

సినిమా ప్రదర్శన అనంతరం చిత్ర బృందాన్ని రాష్ట్రపతి ప్రశంసలతో ముంచెత్తారు. ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసినందుకు అమితాబ్ బచ్చన్ కు రాష్ట్రపతి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రపతి సినిమా చూస్తారని తాను ఊహించలేదని, ఆయనతో సినిమా చూడడం ప్రత్యేక అనుభూతిని ఇచ్చిందని అమితాబ్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News