: సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి: హరిబాబు


టీడీపీ, బీజేపీ పొత్తుపై చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు తెలిపారు. పార్టీల మధ్య పొత్తులు ఉన్నప్పుడు అభ్యంతరాలు సహజమేనని పునరుద్ఘాటించారు. పార్టీ నేత వెంకయ్యనాయుడు నివాసంలో చర్చలు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పరస్పర ప్రయోజనాల కోసం ఇరు పార్టీలు పని చేస్తాయని, ప్రజాదరణ ఉండి గెలిచే అభ్యర్థులనే ప్రకటిస్తాయని తెలిపారు. ఇరు రాష్ట్రాల్లో బీజేపీ, టీడీపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

  • Loading...

More Telugu News