: మమతకు తప్పిన ముప్పు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఎన్నికల ప్రచారం కోసం మాల్దా జిల్లాకు విచ్చేసిన మమత ఓ హోటల్ గదిలో బసచేశారు. ఆమె బాత్ రూమ్ లో ఉండగా ఏసీ నుంచి మంటలు పుట్టి గదిలోకి వ్యాపించాయి. పొగ వాసనను పసిగట్టిన మమత... తన అనుచరుడు జయదీప్ ను కేకలేస్తూ పిలిచారు. లోపలికి వెళ్లిన అతను ఆమెకు మంటలు అంటుకోకుండా, ఒక బెడ్ షీట్ ను ఆమెకు చుట్టి సురక్షితంగా గది బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటన నిన్న సాయంత్రం 6.40 గంటలకు జరిగింది.