: సమర్థులైన నేతలకే ఓటెయ్యాలి: సినీ నటి హరిప్రియ


‘ఈ వర్షం సాక్షిగా’ ఫేం హరిప్రియ రాజకీయాల గురించి తన మనసులోని మాటను బయటపెట్టారు. తనకు రాజకీయాల గురించి పెద్దగా తెలియని రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి విన్నానని హరిప్రియ చెప్పింది. అప్పుడు తాను కర్ణాటకలో డిగ్రీ చదువుకుంటున్నానని, ఆ తర్వాత హీరోయిన్ గా టాలీవుడ్ తో పాటు దక్షిణాది భాషలన్నింటిలో సినిమాలు చేశానని ఆమె చెప్పింది. నిజంగా వైఎస్ లాంటి నేతలు పాలకులుగా రావాలని ఆమె ఆకాంక్షను వ్యక్తం చేసింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భారత్ అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోనే ఉందని ఆమె తెలిపింది. భారత్ అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలవాలంటే సమర్థులైన నేతలకే ఓటెయ్యాలని హరిప్రియ కోరింది.

  • Loading...

More Telugu News