: నన్ను తిట్టడమే కేసీఆర్ ప్రచారం అనుకుంటున్నాడు: పొన్నాల
ఎన్నికల ప్రచారం అంటే తనను తిట్టడమేనని కేసీఆర్ అనుకుంటున్నాడని టీపీసీసీ చీఫ్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. హైదరాబాదులో పొన్నాల మాట్లాడుతూ, వ్యక్తిగత విమర్శలకు దిగడం కేసీఆర్ దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. సన్యాసులకు అధికారం అప్పగించవద్దని కేసీఆర్ ప్రజలను కోరుతున్నారని, అంటే కేసీఆర్ ఓటమిని అంగీకరించినట్టేనని ఆయన విమర్శించారు.