: నేనొక్కటే చెప్పదలుచుకొన్నా...: జగన్


కడప జిల్లా ప్రొద్దుటూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. "నేనొక్కటే చెప్పదలచుకొన్నా.. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి గెలిపించండి" అని జగన్ ప్రజలను కోరారు. ప్రజల సంక్షేమమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. అభివృద్ధి చేసే వారినే నాయకుడిగా ఎన్నుకోవాలని జగన్ పిలుపునిచ్చారు.

గత ఎన్నికల్లో ప్రజల ఆదరాభిమానాలతోనే ఎంపీగా అయిదు లక్షల మెజార్టీతో గెలిచానని, ఇప్పుడు కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డిని గెలిపించాలని, యువనేతగా జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తాడని అన్నారు. చిన్నతనం నుంచి తనను ఆదరిస్తున్నారని... ఇప్పుడు కూడా అవినాష్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం జగన్ వాహనం నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఇవాళ మైదుకూరు, ఖాజీపేట్, కమలాపురం, కడప బహిరంగసభల్లో జగన్ ప్రసంగించనున్నారు.

  • Loading...

More Telugu News