: తెలంగాణ బీజేపీ మేనిఫెస్టో వివరాలు...
తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోను టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విడుదల చేశారు. తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా మేనిఫెస్టోను రూపొందించామని ఆయన తెలిపారు. మేనిఫెస్టోలోని ప్రధానాంశాలు...
* ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా.
* వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం ఆధునిక పరిజ్ఞానం.
* పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం.
* రైతులకు 9 గంటల విద్యుత్ సరఫరా.
* అమరవీరుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం లేదా మూడెకరాల భూమి.
* రూ. 20 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్.
* ఆదిలాబాద్ జిల్లాకు కొమురం భీం పేరు.
* సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం.
* జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినం.
* అక్టోబర్ 19న గిరిజన సాధికార దినం.
* బ్రాండ్ ఇండియా నిర్మాణం.
* నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ.