: మహిళ కడుపులో నుంచి ఏడు కిలోల కణితి వెలికితీత
రంగారెడ్డి జిల్లా తాండూరులోని బాలాజీ నర్సింగ్ హోంలో ఇవాళ ఒక మహిళకు శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు ఆమె కడుపులో నుంచి 7 కిలోల కణితిని వెలికితీశారు. బంటువరం వాసి అంజమ్మ (50) నాలుగేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతోంది. నొప్పి నివారణకు మందులు వాడినా నయం కాలేదు. చికిత్స కోసం ఈ నెల 14న ఆమె తాండూరులోని బాలాజీ నర్సింగ్ హోంకు వచ్చారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యులు కణితి ఉన్నట్లు గుర్తించారు. ఇవాళ మహిళకు గంటన్నర పాటు ఆపరేషన్ చేసి కణితిని తొలగించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.