: కేసీఆర్ ను తిట్టినంత మాత్రాన ఓట్లు రాలవు: హరీష్ రావు


కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని... కేసీఆర్ ను తిట్టినంత మాత్రాన కాంగ్రెస్ కు ఓట్లు రాలవని టీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. తెలంగాణలో వందలాది మంది బలిదానాలకు కారణం కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. జైరాం రమేష్ కు తెలంగాణలో ఓటు అడిగే హక్కు లేదని... ఏనాడైనా ఆయన అమరవీరుల కుటుంబాలను కాని, ఉద్యమకారులను కానీ పరామర్శించారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపు అసంభవమని చెప్పారు.

  • Loading...

More Telugu News