: టీడీపీ, వైఎస్సార్సీపీలకు ఓటు వేయొద్దు: కోదండరాం
తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ, వైఎస్సార్సీపీలకు ఓటు వేయరాదంటూ తెలంగాణ ప్రజలకు టీజేఏసీ ఛైర్మన్ కొదండరాం పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో, విచక్షణతో ఓటు వేయాలని కోరారు. ఈ రోజు హైదరాబాదులోని టీఎన్జీవో భవన్ లో టీజేఏసీ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడారు.