: అతడి కడుపులో 12 బంగారు బిస్కెట్లు


మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్టవిప్పి చూడు పురుగులుండు అన్నట్లు ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్త కడుపులో బంగారు బిస్కెట్లున్నాయి. చాందినీ చౌక్ కు చెందిన 63ఏళ్ల వ్యాపారి ఇటీవలే సింగపూర్ నుంచి వచ్చాడు. వస్తూ వస్తూ 12 బంగారు బిస్కెట్లు, ఒక్కోటీ 33గ్రాముల బరువైనవి మింగేశాడు. విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పాడు. తీరా ఇంటికి వచ్చాక మలం ద్వారా బిస్కెట్లు రాకపోయేసరికి కంగారు పడ్డాడు. విరేచనం సాఫీగా రావడానికి అదీ, ఇదీ తిన్నాడు. అయినా ఉపయోగం లేదు. పైగా నొప్పి మొదలవడంతో శ్రీ గంగారామ్ ఆస్పత్రికి వెళ్లాడు. ప్లాస్టిక్ క్యాప్ మింగానని, సర్జరీ చేయాలని కోరాడు. డాక్టర్లు పొట్టకోసి చూశారు. బంగారు బిస్కెట్లు మెరుస్తూ కనిపించాయి. 12లక్షల రూపాయల విలువైన బిస్కెట్లను బయటకు తీశారు.

  • Loading...

More Telugu News