: ఔటర్ రింగు రోడ్డుపై ప్రమాదం... ఇద్దరు మృతి
గ్రేటర్ హైదరాబాదులోని ఔటర్ రింగు రోడ్డుపై ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. శంషాబాద్ మండల పరిధిలోని పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. ఇవాళ ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.