: మునిగిన పడవ ప్రమాదంలో 25 మంది లెక్క తేలారు...!
దక్షిణ కొరియా సముద్రంలో జరిగిన నౌక ప్రమాదంలో మృతుల సంఖ్య 25కి చేరింది. 475 మంది ప్రయాణికులతో బయలుదేరిన నౌక బుధవారం బ్యోంగ్ హోంగ్ ద్వీపం సమీపంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పటి వరకు 179 మందిని సహాయక దళాలు రక్షించాయి. ఇంకా 271 మంది ఆచూకీ తేలాల్సి ఉంది. గల్లంతైనవారి కోసం ఆ దేశ రక్షణ శాఖ నిరంతర గాలింపు జరుపుతూనే ఉంది. ప్రతికూల వాతావరణం కారణంగా గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతున్నప్పటికీ, హెలికాప్టర్లు, పడవల సాయంతో గాలింపు చేపడుతున్నామని ఆ దేశాధ్యక్షురాలు పార్క్ గ్వెన్ హై తెలిపారు.