: మేం నిజాలు వెల్లడిస్తే ఇంట్లోంచి బయటకు రాలేరు: ఉమాభారతి


ఆమె మాట్లాడితే మంటలే. అందుకే ఫైర్ బ్రాండ్ గా సుపరిచితులు. ఆమె మరెవరో కాదు, బీజేపీ నేత ఉమాభారతి. తాజాగా ఆమె కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఆమె తనయుడు రాహుల్ పై ఫైర్ అయ్యారు. తాము నిజాలు బయటపెడితే వారు ఇంటికే పరిమితం అవుతారని హెచ్చరించారు. దీనికి కారణం ఉమాభారతి గతంలో మోడీపై చేసిన విమర్శల వీడియోను కాంగ్రెస్ బయటపెట్టడమే. మోడీ వికాసపురుషుడు కాదు, వినాశకర పురుషుడు అని గతంలో ఉమా భారతి బీజేపీ నుంచి బయటకు వచ్చిన సందర్భంలో వ్యాఖ్యానించారు. ఆ వీడియోనే కాంగ్రెస్ నిన్న బయటపెట్టింది. దాంతో ఉమాభారతి మండిపడ్డారు. కాంగ్రెస్ గురించిన నిజాలను బీజేపీ బయటపెడితే, సోనియా, రాహుల్ ఇంటికే పరిమితం కావాల్సి వస్తుందని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News