: టీటీడీ కీలక నిర్ణయం.. సాయంత్రం బ్రేక్ దర్శనాలు రద్దు
గత నాలుగు రోజులుగా తిరుమలలో శ్రీవారి దర్శనం సామాన్య భక్తులకు భారమైపోయిన నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై గురువారం మినహా సాయంత్రం సమయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అవసరమైతే వీఐపీ దర్శనాన్ని ఉదయంపూట మరో అరగంట పెంచుతామని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ కనుమూరి బాపిరాజు తెలిపారు. దీనిపై పాలక మండలి సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.