: మోడీ ప్రధాని కాకుండా అడ్డుకోమంటూ బీజేపీ నేతలు నన్ను కలిశారు: ములాయం


నరేంద్రమోడీ ప్రధానమంత్రి కాకూడదని బీజేపీలోని నేతలే కోరుకుంటున్నారని సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను కలసిన కొంతమంది బీజేపీ నేతలు ఎలాగైనా మోడీని ప్రధాని కాకుండా చూడాలని కోరినట్టు తెలిపారు. ఎన్నికల తర్వాత థర్డ్ ఫ్రంట్ అధికారంలోకి వస్తుందని... ఎక్కువ స్థానాలు గెలుచుకున్న సమాజ్ వాదీ పార్టీ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. మెజారిటీ సీట్లు గెలుచుకున్న పార్టీ అధినేతగా తాను ప్రధానమంత్రి పదవిని కోరుతానని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News