: యువకుడిని బలిగొన్న ఆర్టీసీ బస్సు


ఈ మధ్య కాలంలో ఆర్టీసీ బస్సులు ఎంతో మంది ఉసురు తీస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా, ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యంతో మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే, నెల్లూరు జిల్లా కావలి ఆర్డీవో కార్యాలయం వద్ద ద్విచక్రవాహనంపై వస్తున్న మల్లికార్జున (18) అనే యువకుడిని ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో మల్లికార్జున అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఘటనా స్థలాన్ని ఆర్టీసీ డిపో మేనేజర్ శిమ్మన్న, ఎస్సై బాషా పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News