: బీజేపీ అభ్యర్థులతో ప్రత్యర్థులకే లాభం: చంద్రబాబు
పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన స్థానాల్లో బలహీన అభ్యర్థులను నిలబెడుతున్నారని... దీని వల్ల ప్రత్యర్థులు లబ్ధిపొందుతారని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. నరేంద్రమోడీని ప్రధానమంత్రిని చేయాలనే లక్ష్యంతోనే బీజేపీతో పొత్తుపెట్టుకున్నామని... బలహీన అభ్యర్థులతో లక్ష్యం నెరవేరదని చెప్పారు. ఏ ఒత్తిడి వల్లో బీజేపీ బలహీనులను ఎన్నికల బరిలోకి దింపుతోందని అన్నారు.