: అమేథీలో అభివృద్ధి శూన్యం: స్మృతి ఇరానీ
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, అమేధీ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీపై భారతీయ జనతాపార్టీ అభ్యర్థి స్మృతి ఇరానీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓ ప్రముఖ వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తున్న అమేధీలో అభివృద్ధి శూన్యమని ఆమె విమర్శించారు. నియోజకవర్గంలో అనేక మంది యువత నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారని, రోడ్లు, రవాణా సంస్థ అస్తవ్యస్థంగా ఉందని ఆమె ఆరోపించారు. అవినీతి లేని దేశాన్ని కోరుకుంటున్నట్లు మాట్లాడే రాహుల్ కు కాంగ్రెస్ హయాంలో జరిగిన 2జీ, 3జీ, బొగ్గు కుంభకోణాలు కనిపించడం లేదా? అని ఆమె ప్రశ్నించారు.