: అఫిడవిట్ లో పేర్కొన్న జగన్ ఆస్తుల వివరాలు...
పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న వైఎస్సార్సీపీ అధినేత జగన్ తన ఆస్తుల వివరాలను అఫిడవిట్ లో పేర్కొన్నారు. తన మొత్తం ఆస్తుల విలువ రూ. 416 కోట్లుగా ఆయన తెలియజేశారు. ఇందులో రూ. 344 కోట్లు తన పేరు మీద, రూ. 72 కోట్లు తన భార్య భారతి పేరు మీద ఉన్నాయని పేర్కొన్నారు. తనకు సొంత వాహనం కూడా లేదని తెలిపారు. 2011 ఉపఎన్నికల సందర్భంగా తన ఆస్తులను రూ. 445 కోట్లుగా చూపించారు. భారతి వద్ద 9 కిలోల బంగారం, వజ్రాభరణాలు ఉన్నట్టు అఫిడవిట్ లో పేర్కొన్నారు.