: ఈ బీరు తాగితే వాతావరణ కాలుష్యం నుంచి తప్పించుకోవచ్చు!
ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వాతావరణ కాలుష్యం బారిన పడుతూనే ఉంటారు. వాతావరణంలో చోటు చేసుకునే మార్పుల కారణంగా ప్రతి ఏడాది వేలాది మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, రోగాల బారిన పడే వారు కూడా లెక్కకు మించే ఉంటున్నారు. గ్లోబల్ వార్మింగ్ తో అల్లాడిపోతున్న జనాభాను చల్లబరిచేందుకు శాస్త్రవేత్తలు కొత్త ద్రవపదార్థాన్ని మన ముందుకు తీసుకువస్తున్నారు. పచ్చరంగులో ఉండే దీంట్లో బీర్ లో ఉపయోగించే బార్లి గింజలనే ప్రధానంగా వినియోగించినట్లు క్వీన్స్ లాండ్ యూనివర్శిటీ రీసెర్చ్ పీటర్ గోస్ తెలిపారు. ఇది కాలుష్యం బారిన పడి ఈ బీరుతో సేదతీరే వారికి ఒక రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని తెలిపారు.
కాలుష్యం బారిన పడి వేడిని తట్టుకోలేని సమయంలో ఇది ఉపయోగకరంగా ఉందంటున్నారు. దీని ద్వారా అధిక మొత్తంలో కాలుష్యానికి గురైన వ్యక్తికి ఉపశమనం కలిగించవచ్చని పరిశోధకులు తెలిపారు. దీని ధర సాధారణ బీర్ కంటే అధికంగా ఉంటుందన్నారు. దీని ధర 5 యూఎస్ డాలర్లు మొదలుకొని 20 డాలర్ల వరకూ ఉండవచ్చన్నారు.