: ఓటర్ల కోసం ఈసీ 'ఆన్ లైన్' మీడియా ఛానల్


దేశ ప్రజలకు ఓటు విలువను తెలిపేందుకు, ప్రేరణ కలిగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం 'ఆన్ లైన్' మీడియా ఛానల్ ను ప్రారంభించింది. 'ఓటర్ ఎడ్యుకేషన్ ఛానల్' పేరుతో దానికి తీసుకొచ్చింది. ముందుగా దేశ వ్యాప్తంగా ఉన్న ఓటర్లు, యువత అమూల్యమైన తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఛానల్లో అప్ లోడ్ చేసిన వీడియోలో ఎన్నికల ప్రధాన కమిషనర్ వీఎస్ సంపత్ కోరారు. అంతేగాక క్రికెటర్ ఎంఎస్ ధోనీ, సైనా నెహ్వాల్, మహిళా బాక్సర్ మేరీకోంలు యువతకు ఓటు విలువను తెలియజేసే వీడియోలను కూడా ఈ ఆన్ లైన్ ఛానల్లో ఉంచారు. ఇక ఈసీకి బ్రాండ్ అంబాసిడర్ లుగా వ్యవహరిస్తున్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, నటుడు అమీర్ ఖాన్ కు సంబంధించిన వీడియోలను కూడా ఉంచారు. ఇక భారత ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన 'నోటా' ఆప్షన్ ను వినియోగించాల్సిన విధానం గురించి తెలియజెప్పారు.

  • Loading...

More Telugu News